ENGLISH

రాధేశ్యామ్‌’ .. వింటేజ్ ప్రభాస్

14 February 2021-11:01 AM

బాహుబలితో ప్రభాస్ స్టార్ డమ్ స్కై లెవల్ కి తాకింది. ప్రభాస్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో వున్నాయి. ఈ అంచనాలతోనే సాహో లాంటి భారీ సినిమా వచ్చింది. ఐతే భారీదనం వుంది కానీ ప్రభాస్ అభిమానులని ఖుషి చేసే సినిమాగా నిలవలేకపోయింది సాహో. ఐతే ఇప్పుడు ప్రభాస్ నుండి మరో భారీ సినిమా వస్తుంది. అదే ‘రాధేశ్యామ్‌’. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

 

ఈ టీజర్ లో ప్రభాస్ ని చూస్తే.. వర్షం.. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి ప్రభాస్ కి మాస్ ఇమేజ్ తో పాటు లవర్ బాయ్ ఇమేజ్ కూడా వుంది. మొదట్లో ప్రేమకధలే ప్రభాస్ ని ఓ స్థాయిలో తీసుకెళ్ళాయి. కానీ ప్రభాస్ నుండి ప్రేమ కధ వచ్చి చాలా రోజులైయింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ ఆ లోటుని భర్తీ చేసే సినిమాగా కనిపిస్తుంది. టీజర్ చాలా కూల్ గా వుంది. వింటేజ్ ఇటలీ నేపధ్యంలో కనిపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.

 

‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ అభిమానులని అలరించింది. టోటల్ గా ఈ టీజర్ తో మరోసారి వింటేజ్ ప్రభాస్ ని చూసే ఛాన్స్ దొరికింది ఫ్యాన్స్ కి. అన్నట్టు .. ఈ సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ALSO READ: ఫస్ట్ డే ఉప్పెన : వైష్ణవ్ తేజ్ వెరీ వెరీ స్పెషల్