ENGLISH

రాధిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన చిరు

01 May 2022-15:26 PM

చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. భోళా శంక‌ర్‌, గాడ్ ఫాద‌ర్‌, వాల్తేరు వీర‌య్య సినిమాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. మ‌రో రెండు మూడు క‌థ‌లు ఓకే చేశాడు. ఇప్పుడు రాధిక‌కు సైతం చిరు మాటిచ్చాడ‌ట‌. చిరంజీవి - రాధిక‌ల‌ది హిట్ పెయిర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. రాధిక చిత్ర నిర్మాణ రంగంలోనూ ఉన్నారు. రాడాన్ మీడియా వ‌ర్క్స్‌ పేరుతో ఓ సంస్థ‌ని స్థాపించి ఇది వ‌ర‌కు కొన్ని సినిమాలు తీశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర‌వాత టీవీ సీరియ‌ళ్ల‌తో బిజీ అయిపోయారు. ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని రాధిక భావిస్తున్నారు. దానికి చిరు కూడా ఓకే అనేశారు. త్వ‌ర‌లో రాధిక నిర్మాత‌గా, చిరు హీరోగా ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని రాధిక ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

 

డియర్ చిరంజీవి.. త్వరలో మా రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో మీరో ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో ఓ బ్లాక్ బస్టర్ తీయడానికి ఎదురు చూస్తున్నాను’.. అంటూ రాధిక ట్వీట్ చేశారు. ద‌ర్శ‌కుడెవ‌రన్న సంగ‌తి ఇంకా తెలియ‌లేదు. చిరు చేతిలో కూడా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అవి పూర్త‌యితే త‌ప్ప‌.. రాధిక సినిమాకి సంబంధించిన డిటైల్స్ బ‌య‌ట‌కు రావు.

ALSO READ: కాజ‌ల్ పాప... ఇప్పుడు హ్యాపీయేనా?