ENGLISH

ప్రభాస్ కోసం బాలీవుడ్ స్టార్ దర్శకుడు వెయిటింగ్

16 May 2024-22:22 PM

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులంతా ప్రభాస్ కోసం కథలు రాసుకుంటున్నారు. డార్లింగ్ డేట్స్ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తామంటున్నారు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. గత ఏడాది సలార్ తో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. నెక్స్ట్ కల్కి తో రానున్నాడు. ఇవి కాక రాజా సాబ్, సలార్ 2  షూటింగ్ జరుపుకుంటున్నాయి. హను రాఘవపూడి సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. సందీప్ వంగా కూడా ప్రభాస్ తో 'స్పిరిట్' అనే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే మూడు నాలుగేళ్లు ప్రభాస్ ఫుల్ బిజీ. కథలు వినటానికి కానీ, వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవటానికి కానీ ఖాళీ లేదు. ఇలాంటి క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరక్టర్ ప్రభాస్ కోసం ఒక కథ రాసుకుంటున్నాడని సమాచారం. 


మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి హిట్ సినిమాలు తీసిన విలక్షణ దర్శకుడు  రాజ్ కుమార్ హిరాణీ ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం  చేస్తున్నాడట. రీసెంట్ గా షారుఖ్ తో 'ఢంకి' సినిమా తీసాడు. ఈ సినిమా కలక్షన్స్ పరంగా పరవాలేదనిపించినా, ప్రభాస్ సలార్ తో పోటీ పడలేకపోయింది. అప్పుడు ప్రభాస్ కి పోటీగా తన సినిమాని రంగంలోకి దించి, ఇప్పుడు ఏకంగా డార్లింగ్ తోనే సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. 


ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ లాంటి యంగ్, అండ్ క్రేజీ డైరక్టర్స్ తో వర్క్ చేస్తూ రాజ్ కుమార్ హిరానీకి సమయం కేటాయిస్తాడా? అనే సందేహం అందరిలో నెలకొంది. పైగా ప్రభాస్ ఇంకో మూడేళ్లు వరకు సమయం కేటాయించలేని కారణంగా హిరాణీ సాబ్ మరి అన్నాళ్ళు వెయిట్ చేస్తారా? లేక ఇంకో బాలీవుడ్ హీరోతో ఆ ప్రాజెక్ట్ చేస్తారా అని సందేహాలు మొదలయ్యాయి.