ENGLISH

బాలయ్య పై రాజమౌళి సెక్సీ కామెంట్స్

01 September 2017-15:26 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్' చిత్రం పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ బాలయ్య ని సరికొత్త విధంగా చూపించారని మెచ్చుకున్నాడు.

బాలయ్య లో ఉన్న ఎనర్జీని హై రేంజ్ లో మనకు చూపించాడు. గత 100 సినిమాల్లో మనం చూడని బాలయ్యను తెరపై ప్రజెంట్ చేసాడు. 'కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ'.. ఇంతకు మించి అంతకంటే ఏం చెప్పగలం అంటూ ట్వీట్ చేసాడు.

బాలయ్య 101 వ చిత్రంగా 'పైసా వసూల్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలయ్య 'తేడా సింగ్' గా అద్భుత నటనతో ఆకట్టుకున్నాడని విమర్శకులు అభినందిస్తున్నారు.

ALSO READ: 'పైసావసూల్‌' థియేటర్ల వద్ద హల్‌చల్‌