ENGLISH

కల్కి కోసం తారల క్యూ

04 June 2024-19:15 PM

ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. వరల్డ్ వైడ్ గా కల్కి కోసం సినీ ప్రియులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీలో ప్రభాస్ వాడిన వెహికల్ బుజ్జి ని ఇంటర్డ్యూస్ చేసి మరిన్ని అంచనాలు పెంచారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న   ఈ మూవీని వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. మహా నటి తరవాత నాగ్ అశ్విన్ నుంచి వస్తున్న మూవీ ఇదే కావటం విశేషం.  రీసెంట్ గా రిలీజ్ చేసిన యానిమేషన్ సిరీస్ అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంది. 


ఇది కాకుండా కల్కి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనే , దిశా పటాని లాంటి   స్టార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, రానా లాంటి స్టార్లు  గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఇప్పుడు ఇంకో రెండు పేర్లు యాడ్ అయ్యాయి. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్, సీనియర్ నటి శోభన కూడా కల్కి సినిమాలో గెస్ట్ పాత్రల్లో మెరవనున్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే కల్కిలో  ఉన్న క్యాస్టింగ్ తో మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు గెస్ట్ అప్పీరియన్స్ తో మిగతా తారలు కూడా చేరితే కల్కి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంకా ఎంత మంది స్టార్స్ కొత్తగా కల్కిలో కనిపిస్తారో అని నెటిజన్స్ ఆస్తిగా ఉన్నారు. ఈ ప్రచారాలు నిజమో కాదో తెలియాలంటే  జూన్ 27 వరకు ఆగాల్సిందే.  కల్కి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.