ENGLISH

పుష్ప వెనుక రాజ‌మౌళి

17 December 2021-11:00 AM

రాజ‌మౌళికి సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి చాలా సంద‌ర్భాల్లో చెప్పారు కూడా. ఇటీవ‌ల జ‌రిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి కూడా రాజ‌మౌళి అతిథిగా హాజ‌ర‌య్యారు. జ‌గ‌డంలో రామ్ ని ఎలివేట్ చేసిన సీన్ అంటే... రాజ‌మౌళికి చాలా ఇష్టం. ఆర్య‌లో ఓ షాట్ ని... ఆయ‌న మ‌ర్యాద రామ‌న్న‌లో వాడుకున్నారు కూడా. ఇప్పుడు ఈ మేట‌ర్ అంతా ఎందుకంటే... `పుష్ప‌` పాన్ ఇండియా సినిమా కావ‌డానికి రాజ‌మౌళి స‌ల‌హా ఉంది.

 

అదెలా అంటే.... పుష్ప‌ని పాన్ ఇండియా సినిమాగా చేద్దామ‌నుకున్న‌ప్పుడు సుకుమార్ చాలా భ‌య‌ప‌డ్డాడ‌ట‌. హిందీ వెర్ష‌న్ ఈ సినిమాకి అవ‌స‌రం లేద‌ని అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యంలో రాజ‌మౌళి సుకుమార్ కి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. పాన్ ఇండియా సినిమాగానే తీయ‌మ‌ని గైడ్ చేశాడ‌ట‌. ‘నీది ప్యాన్‌ ఇండియా సినిమా. నీవు తెలుగులో రిలీజ్‌ చేేస్త తెలుగు సినిమా అవుతుంది. ఇండియాలో వేర్వేరు భాషల్లో విడుదల చేస్తే ప్యాన్‌ ఇండియా సినిమా అవుతుంది. మరో ఆలోచన లేకుండ ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయ్‌’ అని గట్టిగా మోటివేట్ చేశాడ‌ట‌. రాజ‌మౌళి ఇచ్చిన ధైర్యంతోనే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీశాన‌ని చెప్పుకొచ్చాడు సుకుమార్‌.

ALSO READ: పుష్ప అప్పుడే బ్రేక్ ఈవెన్ !