ENGLISH

రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం ఎలా వుంది?

22 October 2020-12:19 PM

ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ల‌తో పాటు, శివానీ శివాత్మిక కూడా క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని రాజ‌శేఖ‌ర్ కుటుంబ‌మే ధృవీక‌రించింది. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ త‌ప్ప‌.. మిగిలిన‌వాళ్లంతా క‌రోనా నుంచి కోలుకున్నారు. రాజ‌శేఖ‌ర్ ప‌రిస్థితే కాస్త క్లిష్టంగా ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ``నాన్న క‌రోనాతో గ‌ట్టిగా పోరాడుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటారు. భ‌య‌ప‌డాల్సిందేం లేదు`` అని శివాత్మిక తెలిపింది.

 

క‌రోనా కార‌ణంగా రాజ‌శేఖ‌ర్‌కు శ్వాస‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు తలెత్తాయ‌ని తెలుస్తోంది. రాజ‌శేఖ‌ర్ స్నేహితుడికి చెందిన ఓ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు కోవిడ్ చికిత్స అందుతోంది. మ‌రో నాలుగైదు రోజుల్లో ఆయ‌న డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ALSO READ: `ఆర్‌.ఆర్‌.ఆర్‌` టీజ‌ర్ టాక్‌: కొమ‌రం భీమ్ గ‌ర్జ‌న ఇది!