ENGLISH

ఇక త‌ప్ప‌దు... రంగంలోకి దిగుతున్న రాజ‌శేఖ‌ర్‌

05 August 2021-12:34 PM

సోలో హీరోగా రాజ‌శేఖ‌ర్ ప‌ని దాదాపు అయిపోయిన‌ట్టే. ఆమ‌ధ్య `గ‌రుడ వేగ‌`తో హిట్టు కొట్టినా - త‌న కెరీర్‌కి అది ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. ఆ త‌ర‌వాత క‌ల్కి ఫ్లాప్ అవ్వ‌డంతో - రాజ‌శేఖ‌ర్ కెరీర్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో ఇంకొన్నాళ్లు నిల‌బ‌డాల‌న్నా, త‌ను ఫేమ్ లో ఉండాల‌న్నా.. కాస్త దిగి రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అందుకే విల‌న్ గా న‌టించ‌డానికి రెడీ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది.

 

గోపీచంద్ - శ్రీ‌వాస్ కాంబినేష‌న్లో రూపుదిద్దుకునే ఓ సినిమాలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ గా ఎంట్రీ ఇస్తున్న‌ట్టు టాక్‌. ఇది కాకుండా శివ‌కార్తికేయ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రంలోనూ రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి రాజ‌శేఖ‌ర్‌కి ఇలాంటి అవ‌కాశాలు చాలాసార్లు వ‌చ్చాయి. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` సినిమాలో ప్ర‌కాష్ రాజ్ చేయాల్సిన పాత్రలో రాజ‌శేఖ‌ర్ నే ముందు సంప్ర‌దించారు. కానీ మ‌హేష్ బాబు, వెంక‌టేష్ ల‌కు నాన్న గా న‌టించ‌డానికి మ‌న‌సొప్ప‌లేదు. ఆ త‌ర‌వాత కూడా అలాంటి ఆఫర్లు వ‌చ్చాయి. ఎంత పారితోషికం ఇస్తామ‌న్నా... రాజ‌శేఖ‌ర్ ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం రాజ‌శేఖ‌ర్ ఓకే అనేశాడు. సో.. టాలీవుడ్ కి మ‌రో విల‌న్ దొరికేసిన‌ట్టే.

ALSO READ: స్టెప్పులేయ‌బోతున్న ద‌ర్శ‌కేంద్రుడు