ENGLISH

సల్మాన్ సినిమాలో రజనీ కాంత్

26 June 2024-13:02 PM

జవాన్ మూవీతో అట్లీ బాలీవుడ్ లో సత్తా చాటాడు. జవాన్ సినిమాతో షారుఖ్ మార్కెట్ ని  పెంచిన అట్లీ పై బాలీవుడ్ ద్రుష్టి పడింది. ఇప్పుడు కూడా అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మొదట అట్లీ బన్నీ కాంబినేషన్ మూవీ అనుకున్నారు. కానీ ఎందుకో ఈ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు సల్మాన్ తో అట్లీ మూవీ అనౌన్స్ చేసాడు. మొదట షారుఖ్, ఇప్పుడు సల్మాన్ తో అట్లీ టైం సూపరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంబో పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. అట్లీ సల్మాన్ కోసం ఎలాంటి కథ రాసుకున్నాడు. ఎంత పవర్ ఫుల్ గా ఉండనుంది అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇంకొక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ మల్టీ స్టారర్ అని తెలుస్తోంది.


అవును అట్లీ ఈ మూవీని భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కించే పనిలో ఉన్నారు. స‌ల్మాన్ ఖాన్ తో పాటు సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని ఈ సినిమాలో నటింప చేయాలనీ అట్లీ ప్లాన్ చేస్తున్నాడని, ఇందుకోసం రజనీని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అట్లీ-ర‌జ‌నీకాంత్ తో కథా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు, రజనీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. ఒక వేళ ఇదే గనక నిజమైతే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది. సౌత్, నార్త్ లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ గల్లంతు అవటం ఖాయం.


రజనీ కాంత్ - స‌ల్మాన్ ఖాన్ సినిమా అనగానే సినీ ప్రియులు సంతోషిస్తున్నారు. నిజంగా ఇది పట్టా లెక్కాలని కోరుకుంటున్నారు.  స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఎవరన్నది కన్ఫామ్ కాలేదు. మురుగు దాస్ దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ మూవీలో ఎవరు నటిస్తారో చూడాలి. నయన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. సికిందర్ లో ఆఫర్ వస్తే నయన్ తన పాత్ర నచ్చక నో చెప్పిందని టాక్. ఇప్పటికే అట్లీ జవాన్ లో షారుఖ్ తో కలిసి నటించింది. మళ్ళీ అట్లీ అడిగితే నయన్ నో చెప్పే ఛాన్స్ ఉండదని అంటున్నారు ఆమె ఫాన్స్.