ENGLISH

Rajinikanth: ‘కాంతార’లో రజనీకాంత్ నిజమేనా ?

21 February 2023-09:20 AM

చిన్న చిత్రంగా విడుదలై.. పాన్‌ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకొని సత్తా చాటింది ‘కాంతార’. రూ.15కోట్లతో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కాంతార2’ పట్టాలెక్కనుంది. అయితే తాజాగా ఈ మూవీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

ఈ బ్లాక్‌బాస్టర్‌ సినిమా ప్రీక్వెల్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్‌ శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా.. ఆయన మౌనంగా వెళ్లిపోయారట. దీంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. ఇది రూమర్‌ అయితే రిషబ్‌ స్పందించే వాడని.. ఏమీ చెప్పలేదంటే ‘కాంతార2’ లో రజనీ కనిపించడం ఖాయమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.