ENGLISH

ఫ్లాఫ్ ఇచ్చిన దర్శకుడికే పచ్చజెండా.. దటీజ్ రజనీ

17 June 2022-18:08 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చింది దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తో కొత్త సినిమా ఖారారైయింది. ఈ ఇద్దరితో సినిమాను నిర్మిస్తున్నట్టు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ పవర్‌ఫుల్‌ ప్రాజెక్టుకు ‘జైలర్‌’ అనే పేరు ఫిక్స్‌ అయింది. ఈ మేరకు చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌లో రక్తపు మరకలున్న కత్తి వేలాడుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

 

రజనీకాంత్‌కి ఇది 169 చిత్రం. కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీత దర్శకుడు. కొన్ని రోజులుగా ఈ కలయికలో సినిమా ఉంటుందో లేదోనన్న ఊహాగానాలు కోలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. నెలన్స్ , విజయ్ తో తీసిన బీస్ట్ అట్టర్ ఫ్లాఫ్ కావడంతో రజనీతో సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఫ్లాఫ్ హిట్టు అనే లెక్కలు వేయకుండా నెల్సన్ తో సినిమాకి పచ్చజెండా వూపేశారు రజనీ.

ALSO READ: Virata Parvam Review: విరాటపర్వం మూవీ రివ్యూ & రేటింగ్