ENGLISH

'లీక్‌'పై మండిపడ్డ సెక్స్‌బాంబ్‌

11 March 2017-16:27 PM

సంచలనాలకు ముందు రేస్‌లో ఉంటుంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ రాఖీ సావంత్‌. తాజాగా ఈ భామ ఎంఎంఎస్‌ సోషల్‌ మీడియాలో సంచలనాలకు కారణమయ్యింది. రాఖీ సావంత్‌ డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకుంటుండగా ఎవరో తీసిన వీడియోలా కనిపిస్తోంది అది. అయితే అది తనకు సంబంధించినది కాదని, అందులో ఉన్నది తాను కాదని రాఖీ సావంత్‌ అంటోంది. అదీ కాకుండా ఇలాంటి లీకులపై స్పందించాల్సిన అవసరం కూడా తనకు లేదంటూనే స్పందించింది. రాక్షసానందం కోసం తనలాంటి సెలబ్రిటీల పేర్లు వివాదాల్లోకి లాగుతారంటూ మండిపడింది. 'నేను చాలా డేరింగ్‌ ఎక్స్‌పోజింగ్‌ చెయ్యాలనుకుంటే చేస్తా. అది నా ప్రొఫెషన్‌. నేనెప్పుడూ ఇలా దిగజారిపోలేదు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది రాఖీ సావంత్‌. అవును రాఖీ సావంత్‌ ట్రాక్‌ రికార్డు తీసుకుంటే నే తెలుస్తుంది ఎక్స్‌పోజింగ్‌ విషయంలో ఆమె డేరింగ్‌ సంగతేంటో. అలాగే ఘాటు ఘాటుగా హాట్‌ హాట్‌ విమర్శలు చేయడంలో కూడా రాఖీ సావంత్‌కి ఆమెకి ఆమే సాటి. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి సినిమాల్లో పెద్దగా అవకాశాల్లేవు. ఆ కారణంగానే ఇలాంటివాటితో వార్తల్లోకెక్కుతోందని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతో కానీ...ప్రస్తుతం ఈ టాపిక్‌ అయితే హీటెక్కిస్తోంది.

ALSO READ: హీరో శివబాలాజీ కి చేదు అనుభవం!