ENGLISH

రకుల్ పెళ్లి పీటలెక్కనుంది

01 January 2024-19:27 PM

సౌత్ లో తక్కువ టైంలో స్టార్ డమ్ అనుభవించిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సౌత్ లో అగ్ర హీరోలందరి సరసన మెరిసిన రకుల్ కి సడెన్ గా అవకాశాలు తగ్గాయి. అదే  టైమ్ లో  బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది. కానీ అక్కడ కూడా నిలదొక్కు కోలేక పోయింది. ఈ క్రమంలోనే  పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆలోచనలో ఉందని టాక్. బాలీవుడ్ హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ జాకీ భ‌గ్నానీతో కొన్నాళ్లుగా రిలేషన్ లో  ఉంది రకుల్. పెద్దల అంగీకారంతో 2024 ఫిబ్రవరి 22న ఈ జంట ఒక ఇంటి వారు కానున్నారు. 


డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. గోవాలో పెళ్లి జరగనుంది. కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే  వీరి పెళ్ళికి హాజ‌రుకానున్నారని, ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని బీ టౌన్ టాక్. రకుల్ ప్రజంట్ త‌మిళంలో అయ‌లాన్, ఇండియ‌న్ 2 సినిమాలు చేస్తోంది. జాకీ భ‌గ్నానీ కూడా 'ఫాల్తు', 'రంగ్రేజ్‌', 'యంగీస్థాన్‌' లాంటి బాలీవుడ్ సినిమాల్లో హీరోగా న‌టించాడు. ప్ర‌స్తుతం నిర్మాతగా కొనసాగుతున్నాడు.