ENGLISH

ర‌కుల్ తో రొమాన్స్ చేయ‌బోతున్న బాల‌య్య‌?

05 July 2021-12:00 PM

సినిమా త‌ర‌వాతే సినిమా అనే సూత్రానికి పెద్ద హీరోలంతా చెక్ పెట్టేశారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే.. రెండు మూడు క‌థ‌ల‌కు ఓకే చెప్పేస్తున్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల్ని సెట్ చేసేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ఒకేసారి రెండు సినిమాల్ని సమాంత‌రంగా రూపొందిస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఇదే పంథాలో దూసుకుపోతున్నారు.

 

బాల‌య్య ప్ర‌స్తుతం `అఖండ‌`గా క‌నిపించ‌బోతున్న సంగతి తెలిసిందే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు. చిత్రీక‌ర‌ణ పూర్తికావొచ్చింది. ఆ త‌ర‌వాత‌.. గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా ఉంటుంది. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి బాల‌య్య కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీ‌వాస్ కూడా బాల‌య్య‌తో జ‌ట్టు క‌ట్ట‌డానికి రెడీ అయ్యాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇది వ‌ర‌కు `డిక్టేట‌ర్‌` వ‌చ్చింది. అది స‌రిగా ఆడ‌లేదు. అయినా స‌రే.. శ్రీ‌వాస్ పై బాల‌య్య న‌మ్మ‌కం ఉంచి, మ‌రో ఛాన్స్ ఇచ్చిన‌ట్టు భోగ‌ట్టా. ఈ చిత్రానికి సంబంధించిన క‌థ కూడా రెడీ అయ్యింద‌ని, ఇందులో క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. ఈచిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

ALSO READ: సుకుమార్ కి కుద‌ర్లేదు.. హ‌రీష్ తో సెట్ట‌య్యింది.