ENGLISH

అఫీషియల్: నిర్మాత ప్రేమలో రకుల్

10 October 2021-16:26 PM

రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడింది. ప్రేమలో పడటమే కాదు తన ప్రేమికుడి పేరుని కూడా ప్రకటించింది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. జాకీ భగ్నానీతో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ‘థ్యాంక్‌ యు మై లవ్‌. ఈ ఏడాది నేను అందుకున్న పెద్ద గిఫ్ట్ నువ్వే. నా జీవితంలో రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తున్నందుకు ...''అని లవ్ సింబల్స్ తో తన ప్రేమని తెలియబరిచింది రకుల్.

 

ప్రేమ విషయం తెలియజేయడంతో రకుల్ కు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు. జాకీ భగ్నానీ చాలా లక్కీ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాకీ విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ తనయుడు జాకీ భగ్నానీ. ‘రెహ్నా హై తేరే దిల్‌ మే‌’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాడు.‘ఫాల్తు’, ‘అజబ్‌ గజబ్‌ లవ్‌’, ‘యంగిస్థాన్‌’, ‘వెల్‌కమ్‌ టు కరాచీ’సినిమాలో నటించాడు. ‘సర్జ్బిత్‌’, ‘దిల్‌ జంగ్లీ’, ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’, ‘కూలీ నం. 1’, బెల్‌ బాటమ్‌, మహా వీర్ కర్ణ చిత్రాలని నిర్మించాడు.

 

రకుల్ విషయానికి వస్తే .. 'కెరటం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అయితే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా ఆమెకు తొలి విజయాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు రకుల్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, నాగచైతన్య ఇలా స్టార్ హీరోలతో జతకట్టింది. ఒక దశలో టాప్ లీగ్ లో కొనసాగింది. అయితే కొనాళ్ళుగా రకుల్ జోరు తగ్గింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పై ద్రుష్టి పెట్టింది. ఇప్పుడు తన ప్రేమ గురించి అఫీషియల్ గా ప్రకటించింది అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది రకుల్.

ALSO READ: పోలింగ్ రివ్యూ : 'మా' ఎన్నికల సరికొత్త పదనిస