ENGLISH

అప్పుడు నయనతార, ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

13 April 2017-11:28 AM

ఎఆర్‌ మురగదాస్‌ దర్శకత్వం వహించిన 'గజిని' సినిమాలో హీరోయిన్‌ నయనతార మెడికోగా కనిపిస్తుంది. అందులో మరో హీరోయిన్‌ అసిన్‌ సంగతి వేరు. ఇప్పుడు లేటెస్ట్‌గా మహేష్‌తో మురుగదాస్‌ రూపొందిస్తున్న 'స్పైడర్‌' సినిమాలో హీరోయిన్‌ పాత్ర రివీల్‌ అయ్యింది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో మెడికోగా కనిపించనుంది. చేతిలో స్టెతస్కోప్‌తో మహేష్‌ పక్కన రకుల్‌ ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'స్పైడర్‌' ఫస్ట్‌ లుక్‌తోపాటు ఈ ఫొటోకి కూడా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మహేష్‌బాబు ఫోన్‌లో ఏదో చూస్తుండగా, పక్కనే ఉన్న రకుల్‌, మహేష్‌నే గమనిస్తున్న ఫొటో అది.ఇదంతా లిఫ్ట్‌ సెటప్‌లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. లిఫ్ట్‌ సెటప్‌ అంటే మళ్లీ 'పోకిరి' సినిమా గుర్తుకురావడం సహజం. 'గజిని', 'పోకిరి' రెండు సినిమాలూ బ్లాక్‌ బస్టర్లే. దానికి తోడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎలాగూ గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంది టాలీవుడ్‌లో. మురుగదాస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు రేపు వెలుగు చూడనున్నాయట. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుండగా, రేపు తమిళ సంవత్సరాది కారణంగా తమిళ ఆడియన్స్‌ కోసం మురుగదాస్‌ కొత్త విషయాల్ని వెల్లడించనున్నాడని సమాచారమ్‌. 

ALSO READ: కొబ్బరిమట్ట పాటలో సంపూ విశ్వరూపం...