ENGLISH

ర‌కుల్ కి క‌రోనా!

22 December 2020-16:44 PM

టాలీవుడ్ క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌రోనా బారీన ప‌డింది. ఈ విష‌యాన్ని ర‌కుల్ సోష‌ల్ మీడియా ద్వారా.. అభిమానుల‌కు తెలియ‌ప‌రిచింది. తాను కోవిడ్ బారీన ప‌డ్డాడ‌ని ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, త్వ‌ర‌లోనే షూటింగుల్లో పాల్గొంటాన‌ని చెప్పింది ర‌కుల్.

 

టాలీవుడ్ లో ర‌కుల్ ఇప్పుడు బిజీ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం క్రిష్‌సినిమాలో న‌టిస్తోంది. అది కాక‌.. మ‌రో మూడు ప్రాజెక్టులు ర‌కుల్ చేతిలో ఉన్నాయి. వాటికి ప్ర‌స్తుతానికి బ్రేక్ ప‌డిన‌ట్టే. అయితే.. ర‌కుల్ ఫిట్నెస్ ఫ్రీక్‌. కాబ‌ట్టి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతానికి తాను హౌం క్వారెంటైన్‌లో ఉంది. త్వ‌ర‌లోనే ర‌కుల్ ని సెట్స్ పై చూడొచ్చు.

ALSO READ: కరోనా కొత్త స్ట్రెయిన్‌: మళ్ళీ సినీ పరిశ్రమలో గందరగోళం