ENGLISH

తెలుగులో త‌గ్గింది... హిందీలో కుమ్మేస్తోంది

29 June 2021-12:30 PM

తెలుగులో ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా వెలిగింది ర‌కుల్ ప్రీత్ సింగ్. అయితే ఈమ‌ధ్య రకుల్ హ‌వా తెలుగులో బాగా త‌గ్గిపోయింది. త‌న చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా `కొండ‌పొలెం`న‌వ‌ల‌ని సినిమాగా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది త‌ప్ప‌.. ర‌కుల్ చేతిలో తెలుగు సినిమా ఏదీ లేదు. అయితే హిందీలో మాత్రం ర‌కుల్ య‌మ బిజీ. అటాక్‌, మేడే, థాంక్ గాడ్ లాంటి చిత్రాల్లో న‌టిస్తోంది ర‌కుల్. తాజాగా మ‌రో ఆఫ‌ర్ కూడా అందుకుంది.

 

అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌థానాయ‌కుడిగా రంజిత్ తివారీ దర్శ‌కత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో క‌థానాయిక‌గా ర‌కుల్ ని ఫిక్స్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ తో ర‌కుల్ చేసే రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వ‌ర‌కు `దే దే ప్యార్ దే` సినిమా వ‌చ్చింది. అందులో ర‌కుల్, అజ‌య్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. అందుకే మ‌రోసారి ర‌కుల్ ని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని టాక్‌. తెలుగులో ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా, బాలీవుడ్ లో మాత్రం జెండా బాగానే ఎగ‌రేస్తోంది. మ‌రి.. అక్క‌డి జ‌నాల మ‌న‌సుల్ని గెలుచుకోవ‌డానికి ఏం మంత్రం వేసిందో?

ALSO READ: క‌త్తి మ‌హేష్ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌