ENGLISH

Ram: రామ్ వ‌దులుకొన్న హిట్టు సినిమా అదేనా?

26 July 2022-18:02 PM

ప్ర‌తీ హీరోకీ త‌న కెరీర్‌లో ఒక్క‌సారైనా పోలీస్ యూనిఫామ్ వేయాల‌నిపిస్తుంది. రామ్ కి కూడా అలానే అనిపించి 'ది వారియ‌ర్‌' చేశాడు. కానీ.. అనుకొన్న ఫ‌లితం రాలేదు. ఈ సినిమా ఫ్లాప్ తో.. రామ్ ఇంకెప్పుడూ పోలీస్‌గా క‌నిపించే ధైర్యం చేయ‌క‌పోవొచ్చు. అలా... త‌న పోలీస్ క‌ల‌... డిజాస్ట‌ర్ అయిపోయింది. నిజానికి పోలీస్ క‌థ చేయాల‌నుకొన్న‌ప్పుడు చాలా క‌థ‌లు విన్నాడు. రిజెక్ట్ చేశాడు. అందులో ఓ హిట్టు సినిమా క‌థ కూడా ఉండ‌డం విచిత్రం.

 

ర‌వితేజ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో `క్రాక్‌` వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది కూడా పోలీస్ క‌థే. ఈ క‌థ ముందు రామ్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. కానీ రామ్ దాన్ని రిజెక్ట్ చేశాడు. చివ‌రికి ర‌వితేజ చేసి హిట్టు కొట్టాడు. ర‌వితేజకి ఈమ‌ధ్య కాలంలో ప‌డిన పెద్ద హిట్.. 'క్రాక్‌'. ఆ సినిమా త‌ర‌వాత త‌న పారితోషికం మ‌రింత పెరిగింది. అదే క‌థ‌ని రిజెక్ట్ చేసిన రామ్ - 'ది వారియ‌ర్‌'కి ఓకే చెప్పాడు

 

నిజానికి ఈ క‌థ కూడా ఇండ‌స్ట్రీలో చాలామంది హీరోల ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. వాళ్లంతా `నో` చెబితే, రామ్ ఏరి కోరి ఓకే చేసుకొన్నాడు. అదే... `క్రాక్` చేసుంటే, రామ్ కి మంచి ఫ‌లితం ద‌క్కేది. పోలీస్ స్టోరీతో హిట్టు కొట్టాన‌న్న సంతృప్తి కూడా మిగిలేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకొన్నాడు.

ALSO READ: సుమంత్ కెరీర్‌... 'సీతారామం'తో మార‌బోతోందా?