ENGLISH

రామ్... వైష్ణ‌వ్‌.. ఇద్ద‌రూ కాద‌ట‌!

22 March 2021-18:16 PM

ఓ సినిమా తో హిట్టు కొట్ట‌గానే, ఆ ద‌ర్శ‌కుడ్ని వ‌ద‌ల‌రు నిర్మాత‌లు. `మా బ్యాన‌ర్‌లో చేయ్‌..` అంటే.. `మా బ్యాన‌ర్‌లో చేయ్‌` అంటూ... అడ్వాన్సులు, చెక్కుల‌తో వెంట ప‌డ‌తారు. అలా ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు... అనుదీప్‌. `జాతిర‌త్నాలు`తో అనుదీప్ పేరు మార్మోగిపోతోంది. అనుదీప్‌.. రామ్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, కాదు.. వైష్ణ‌వ్ తేజ్ తో సినిమా ఓకే అయ్యింద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

వీటిపై క్లారిటీ వచ్చేసింది. అనుదీప్ హీరో ఎవ్వ‌ర‌నేది ఇంకా ఫిక్స్ కాలేదు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే... `జాతిర‌త్నాలు` అవ‌కాశం ఇచ్చిన వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్‌లోనే అనుదీప్ త‌న త‌దుప‌రి సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. క‌థ ఇంకా రెడీ కాలేద‌ని, క‌థ రెడీ అయ్యాకే హీరో ఎవ‌ర‌న్న‌ది ఫిక్స్ అవుతార‌ని అనుదీప్ అంటున్నాడు. మ‌రోవైపు రామ్.. బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో సినిమా ఫిక్స‌య్యింద‌న్న వార్త‌లొస్తున్నాయి. వైష్ణ‌వ్ చేతిలోనూ చాలా సినిమాలు ప‌డ్డాయి. కాబ‌ట్టి... అనుదీప్ మ‌రో హీరోని వెదుక్కోవాల్సిందే.

ALSO READ: మంచు హీరో సినిమాలో మెగా హీరో ఎంట్రీ?!