ENGLISH

వరుణ్ కోసం సల్మాన్ , చెర్రీ!

20 February 2024-19:45 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పానిండియా మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చ్ 1st న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే వైమానిక దాడి బ్యాక్‍ డ్రాప్‍లో వస్తున్నఈ స్టోరీ సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ మూవీ ట్రైలర్  మంగళవారం రిలీజైంది. ఇందులో వరుణ్ తేజ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ దేశభక్తి  డైలాగులు తో కమర్షియల్ సినిమాగా తెలుస్తోంది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.


పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. 'రుద్ర' అనే ఓ పవర్ ఫుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్ ఈ మూవీలో కనిపించాడు. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటిస్తోంది.


ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది మూవీ టీమ్. వరుణ్ మొదటి పాన్ ఇండియా మూవీ  కావటంతో తనకి సపోర్ట్ గా చెర్రీ, సల్మాన్ లు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 20 న  సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ కండలవీరుడు  సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను  రామ్‍చరణ్ రిలీజ్ చేశారు. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు మూవీ టీమ్ తెలిపిన సంగతి తెలిసిందే.

ALSO READ: Operation Valentine Trailer