ENGLISH

షారుఖ్ పై చెర్రీ ఫాన్స్ ఫైర్

05 March 2024-19:47 PM

అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే మాటలు కాదు. చిన్నప్పుడు కథల్లో విన్నట్టు ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీఠ అన్న చందాన జరిగింది. అదీ పెళ్లి వేడుక కాదు, ప్రీ వెడ్డింగ్. పెళ్ళికి ఇంకెంత హంగామా ఉంటుందో మరి. ఈ వేడుకకి దేశ విదేశాల నుంచి అతిధులు వేంచేశారు. బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ఈ వేడుకలో మెరిశారు. సౌత్ నుంచి కేవలం రజిని కాంత్, మెగా వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకి మాత్రమే ఈ ఇన్విటేషన్ వచ్చింది. చెర్రీ సతీ సమేతంగా  ఈ పెళ్లి వేడుకకి అటెండ్ అయ్యాడు. అక్కడ ఆతిధ్యం చాలా గొప్పగా ఉందని ఉపాసన పోస్ట్ చేసింది. కానీ ఉపాసన పర్సనల్ మేకప్ విమెన్ 'జేబా హసన్' తన ఇనిస్టా వేదికగా పెట్టిన పోస్ట్ విపరీతమైన చర్చకు దారి తీస్తోంది. అంబానీ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో చరణ్‌ను అవమానించారని, ఇది ఎలా జరిగిన ఓ సౌత్‌ స్టార్‌ని అలా పిలవడం నచ్చలేదంటూ పోస్ట్‌ షేర్‌ చేసింది.


ముఖేష్‌-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మార్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు కనుల పండుగగా ముగిశాయి. గుజరాత్ జామ్‌నగర్‌ వేదికగా ఈ వేడుక జరిగింది. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో చరణ్‌కు అవమానం జరిగిందంటూ టాలీవుడ్‌, మెగా ఫ్యాన్స్‌ బాలీవుడ్‌పై, షారుఖ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయమేంటి అంటే ప్రీవెడ్డింగ్‌ వేడుకలో రామ్‌ చరణ్‌ స్టేజ్‌పై  ఖాన్‌ త్రయంతో కలిసి నాటూ నాటూ పాటకు స్టెప్పులేసాడు. ఈ పాటకి ముందు షారుఖ్  చెర్రీని పిలుస్తూ తమిళ్‌ భాషలో ఇడ్లీ, వడా సాంబార్ తినేసి కూర్చున్నావా? రామ్ చరణ్ ఎక్కడున్నావ్? అంటూ పిలిచాడని, గ్లోబల్‌ స్టార్‌  చరణ్‌ను ఇడ్లీ, సాంబార్‌ అని పిలవడం కరక్ట్ కాదని టాలీవుడ్‌పై ఉన్న అక్కసును షారుక్ ఇలా బయటపెట్టాడంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.
 

జెబా కూడా విచారం వ్యక్తం చేస్తూ "ఆ టైంలో నేను కూడా స్టేజ్‌పై ఉన్నాను. రామ్‌ చరణ్‌ను ఇడ్లీ-వడా అని పిలవడంతో నాకు కోపం వచ్చింది. ఆయనను అలా పిలవడం నాకు నచ్చలేదు. దీంతో వెంటనే స్టేజ్‌ దిగి కిందకువెళ్లిపోయాను. బాలీవుడ్‌కు టాలీవుడ్‌, సౌత్‌ ఇండస్ట్రీ అంటే చిన్నచూపు అనేది ఈ తాజా సంఘటనతో మరోసారి రుజువైంది" అంటూ  జెబా హాసన్‌ తన పోస్ట్‌లో పేర్కొంది.  చెర్రీకి ఉన్న క్రేజ్ భరించలేక షారుఖ్ ఇలా బిహేవ్ చేశాడంటూ తెలుగు ఆడియన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.