ENGLISH

డాక్టరేట్ అందుకుంటున్న చెర్రీ

12 April 2024-12:27 PM

మెగా వారసుడిగా సినీపరిశ్రమలో అడుగు పెట్టిన రామ్ చరణ్ తక్కువ  టైమ్ లోనే ఎనలేని గుర్తింపు పొంది, గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. చెర్రీ లీడ్ రోల్ లో నటించిన RRR తో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. హాలీవుడ్ సినిమాల్లో కూడా చరణ్ కి అవకాశాలు వస్తున్నాయి. RRR లో ఎన్టీఆర్ తో కలిసి చెర్రీ చేసిన నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, అత్యుత్తమ పురస్కారమైన ఆస్కార్ ని కూడా గెలుచుకుంది. చరణ్ ప్రజంట్ శంకర్ దర్శకత్వంలో  గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ బుచ్చి బాబు సానా తో ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. మరి కొన్ని చర్చల  దశలో ఉన్నాయి.  ఇప్పుడు రామ్ చరణ్ కృషికి మరో అరుదైన గౌర‌వం దక్కింది.  


చెన్నైలోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ కాన్వకేషన్ వేదికగా చ‌ర‌ణ్‌కి  గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఏప్రిల్ 13న ఈ కార్యక్రమం జరగనుంది. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటెండ్ కానున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకోనున్నట్లు సమాచారం. 


చరణ్ కి గౌరవ డాక్టరేట్ రావటం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డుతో చెర్రీ గుర్తింపు మరింత పెరిగిందని, ఫాన్స్, సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ చేసే హార్డ్ వర్క్ కి మంచి గుర్తింపు లభించింది అని మురిసిపోతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.