ENGLISH

చ‌లానా కింగ్‌.. రామ్ చ‌ర‌ణ్‌!

14 March 2017-12:02 PM

సెల‌బ్రెటీలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవ‌డం, రాష్ గా కారు న‌డిపి పోలీసుల‌కు చిక్క‌డం చూస్తూనే ఉన్నాం. రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న కారు వేగంగానే న‌డుపుతాడ‌ట‌. నో పార్కింగ్ జోన్‌లో కారు పార్క్ చేసి.. పోలీసుల‌కూ దొరికిపోయేవాడ‌ట‌. ఈ విష‌యాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చ‌ర‌ణ్‌కి  రేంజ్ రోవ‌ర్ కారు ఉంది.  టీఎస్ 09 ఈఎస్ 2727 నెంబ‌రు గ‌ల ఈ కారుకి ఇప్ప‌టి వ‌ర‌కూ 5 సార్లు ట్రాఫిక్ పోలీసులు చ‌లానా విధించార్ట‌. ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘిస్తే... ఆ స‌మ‌యానికి ట్రాఫిక్ పోలీసులు లేక‌పోయినా  సీసీ కెమెరాల ద్వారా కారునెంబ‌రు రికార్డు అయిపోతుంది. త‌ద్వారా ఇళ్ల‌కే చ‌లానాలు చేర‌తాయి. అలా.. రామ్ చ‌ర‌ణ్ 5 సార్లు బుక్క‌యిపోయాడ‌ట‌. అయితే ఆ చ‌లానాలు ఇప్ప‌టివ‌ర‌కూ చెల్లించ‌లేద‌ని తెలుస్తోంది. కారు రామ్‌చ‌ర‌ణ్ డ్రైవ్ చేశాడా, లేదంటే ఇదంతా డ్రైవ‌ర్ నిర్ల‌క్ష‌మా అనేది తేల‌క‌పోయినా.. త‌న కారుకి సంబంధించి చ‌ర‌ణ్ త‌న జాగ్ర‌త్త‌ల్లో తాను ఉండాలి. లేదంటే చ‌లానా కింగ్ అనే పేరు శాశ్వ‌తంగా నిలిచిపోతుంది.