ENGLISH

రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’

27 March 2023-12:00 PM

మెగా అభిమానులందరూ ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్‌ విడుదలైంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది.

 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఎన్నికల నేపధ్యంలో ఉంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ లోగోలో ఎన్నికల గుర్తు కనిపించడంతో సినిమాకి అదే నేపధ్యం అనే విషయం స్పష్టత వచ్చింది.

 

ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు.