ENGLISH

ఇది రామ్ చ‌ర‌ణ్ - ఒకే ఒక్క‌డు

18 February 2021-10:35 AM

శంక‌ర్ సినిమాల‌న‌గానే చ‌టుక్కున గుర్తొచ్చేది `ఒకే ఒక్క‌డు`. ఒక రోజు ముఖ్య‌మంత్రి అనే ఆలోచ‌న‌తో శంక‌ర్ అల్లిన క‌థ అది. ఆ ఆలోచ‌న‌, దాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన ప‌ద్ధ‌తి... సూప‌ర్బ్ అంతే. ఆ త‌ర‌వాత‌.. శంక‌ర్ పొలిటిల‌క్ డ్రామా ట‌చ్ చేయ‌లేదు. ఇప్పుడు... సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌.. శంక‌ర్ ఆ జోన‌ర్ ని ఎంచుకున్నాడ‌ని టాక్. రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రం ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని టాక్‌. ఒకే ఒక్క‌డు త‌ర‌హాలో ఓ కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడ‌ట శంక‌ర్‌. ఇది కూడా ముఖ్య‌మంత్రికి సంబంధించిన క‌థే. దాన్ని కొత్త త‌ర‌హాలో చూపించ‌నున్నాడ‌ట శంక‌ర్‌. ఓ సామాన్యుడికీ, రాష్ట్ర ముఖ్య‌మంత్రికీ జ‌రిగే పోటీని శంక‌ర్ తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ లేదు.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్‌.... త‌మిళ రేటు అదుర్స్‌!