ENGLISH

Ram Charan: చ‌ర‌ణ్ సినిమాకు 'ఓవ‌ర్సీస్‌' రేటు అదిరింది

12 July 2022-11:38 AM

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శంక‌ర్ సినిమాలంటే... బ‌డ్జెట్లు ప‌రిధులు దాటుతుంటాయి. ఈ సినిమాకీ అదే జ‌రుగుతోంది. ఒక్కో పాట కోసం కోట్లు కోట్లు ఖ‌ర్చు పెట్టిస్తున్నాడ‌ట‌. అయితే దిల్ రాజు కూడా ధైర్యంగానే అడిగింద‌ల్లా ఇస్తూ పోతున్నాడు. ఎందుకంటే... శంక‌ర్ స్టామినా త‌న‌కు తెలుసు. సినిమాని వేరే లెవ‌ల్ లోకి తీసుకెళ్తాడ‌న్న‌ది దిల్ రాజు న‌మ్మ‌కం. అన్నీ స‌వ్యంగా జ‌రిగితే.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టే సామ‌ర్థ్యం ఈ సినిమాకి ఉంది.

 

ఇప్పుడు ఈ సినిమాకి అదిరిపోయే ఓర‌ర్సీస్ రేటు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఓ డిస్టిబ్యూట‌ర్ ఈసినిమాని రూ.45 కోట్ల‌కు కొన‌డానికి ముందుకొచ్చాడ‌ని స‌మాచారం. దిల్ రాజు కీ ఈ ఆఫ‌ర్ ఫ్యాన్సీగానే అనిపిస్తోంద‌ట‌. అందుకే డీల్ క్లోజ్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ క‌నిపిస్తున్నాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

ఈ సినిమా స‌గం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఒక్క స్టిల్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. టైటిల్ కూడా ఎనౌన్స్ చేయ‌లేదు. అప్పుడే ఓవ‌ర్సీస్ డీల్ క్లోజ్ అవ్వ‌బోతోందంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే... దిల్ రాజు కూడా ఖ‌ర్చుకి ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేద‌ట‌. 2023 వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

ALSO READ: ఇగో క్లాష్‌తో సినిమా ఆగిపోనుందా?