ENGLISH

రామ్ చ‌ర‌ణ్‌.. శంక‌ర్ చెరో 40 కోట్లు..?

03 April 2021-09:07 AM

శంక‌ర్ సినిమాల‌న్నీ భారీగానే ఉంటాయి. త‌న పారితోషికం కూడా అంతే. దేశం మొత్తం మీద అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న ద‌ర్శ‌కుల జాబితాలో త‌న పేరు ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి గానూ శంక‌ర్ 40 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడ‌ట‌. అంతే కాదు.. రామ్ చ‌ర‌ణ్‌కి సైతం అంతే పారితోషికం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

అటు చ‌ర‌ణ్‌కి 40, ఇటు.. శంక‌ర్ కి 40.. అంటే అక్క‌డే 80 కోట్లు ఎగిరిపోతోంది. ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపు 150 కోట్ల‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే ప్రొడ‌క్ష‌న్‌కీ, ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల‌కూ.. 70 కోట్లు కేటాయించార‌న్న‌మాట‌. శంక‌ర్ - చ‌ర‌ణ్ కాంబినేష‌న్ చెప్ప‌గానే వ్యాపారం జ‌రిగిపోతుంద‌న్న‌ది దిల్ రాజు న‌మ్మ‌కం. అందుకే ఈ స్థాయిలో పారితోషికాలు ఇవ్వ‌డానికి రెడీ అయ్యాడు. సినిమా అయ్యేట‌ప్ప‌టికి బ‌డ్జెట్ లెక్క‌లు ఎలా ఉంటాయో మ‌రి..?!

ALSO READ: 'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ & రేటింగ్!