ENGLISH

చ‌ర‌ణ్ వాయిస్ ప్ల‌స్సా..? మైన‌స్సా?

23 October 2020-16:00 PM

`కొమ‌రం భీమ్‌`గా ఎన్టీఆర్ ని చూడాల‌న్న క‌ల‌.. నెర‌వేరిపోయింది. నంద‌మూరి అభిమానుల‌కు ఎన్టీఆర్ విశ్వ‌రూప ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` రెండో టీజర్ ప్ర‌స్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ టీజ‌ర్ లోకి కొన్ని షాట్లు... పాత‌వే అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నేష‌న‌ల్ జాగ్ర‌ఫీ ఛాన‌ల్ లోని కొన్ని షాట్ల‌ని రాజ‌మౌళి య‌ధాత‌ధంగా వాడుకున్నాడు.

 

అల్లూరి సీతారామ‌రాజుకి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన‌ట్టే, ఎన్టీఆర్ టీజ‌ర్ కొమ‌రం భీమ్ కి చ‌ర‌ణ్ గొంతు అరువిచ్చాడు. అయితే.. ఎన్టీఆర్ వాయిస్ లో ఉన్న ఫైర్‌, ఫోర్స్‌.. చ‌ర‌ణ్ వాయిస్ లో క‌నిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. దాంతో పాటు బుర్రా సాయి మాధ‌వ్ రాసిన డైలాగులు కూడా పెద్ద‌గా పేల‌లేద‌ని, అల్లూరి సీతారామ‌రాజు ఎలివేష‌నే బాగుంద‌ని అంటున్నారు. ఇలా కొంత డివైడ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ... `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లోని... ఎన్టీఆర్ టీజ‌ర్ బాగానే పేలింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కైతే తెగ న‌చ్చేసింది. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ‌లంగా న‌మ్ముతున్నారు. రాజ‌మౌళి సినిమా క‌దా, టీజ‌ర్లు ఎలా ఉన్నా సినిమా మాత్రం అదిరిపోతుంద‌ని అంద‌ని న‌మ్మ‌కం.

ALSO READ: పాపం.... శంక‌ర్ న‌లిగిపోతున్నాడు