ENGLISH

వ‌ర్మ అదిరిపోయే పంచ్‌

03 August 2020-11:22 AM

మాట‌ల్లో చేత‌ల్లో వ‌ర్మ‌ని కొట్ట‌లేరెవ‌రూ. వ‌ర్మ మాట్లాడ‌డం మొద‌లెడితే - మ‌న ద‌గ్గ‌ర లాజిక్కులే ఉండ‌వు. మాట‌ల‌తో ప‌డేయ‌డంలో ఆర్జీవి రూటే సెప‌రేటు.


ఈమ‌ధ్య వ‌రుస సినిమాల‌తో హ‌డ‌లెత్తిస్తున్నాడు వ‌ర్మ‌. కాంట్ర‌వ‌ర్సీతో క‌రెన్సీ సృష్టించుకుంటున్నాడు. త‌న‌లో క్రియేటివిటీ ఎప్పుడో చ‌నిపోయింద‌ని, కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు తీస్తున్నాడ‌ని - ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఆర్జీవి త‌న‌దైన స్టైల్లో స్పందించాడు. తాను డ‌బ్బుల కోస‌మే సినిమాలు తీస్తానన్న‌ది నిజ‌మేన‌ని... మిగిలిన‌వాళ్లు మాత్రం చారిటీ కోస‌మో, ప్ర‌జా సేవ కోస‌మో సినిమాలు తీస్తున్నారా? అంటూ ప్ర‌శ్నించాడు. `నేను డ‌బ్బు మ‌నిషిని, నాకు స్వార్థం ఎక్కువ‌` అని వ‌ర్మ‌నే చాలాసార్లు ఒప్పుకున్నాడు. పైగా.. సినిమా ఎవ‌రు తీసినా, ఎలాంటి క‌థ‌తో తీసినా.. డ‌బ్బుల్ని రాబ‌ట్టుకోవాల‌న్న‌ది వాళ్ల అంతిమ ధ్యేయం అయ్యుంటుంది. అందులో త‌ప్పేం లేదు. వ‌ర్మ పాయింట్ కూడా అదే.