ENGLISH

వర్మకేంటి, ఎవరికైనా ఏడుపొచ్చేస్తుంది!

13 March 2017-17:23 PM

బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ప్రశంసలు అందుకోవడమంటే చిన్న విషయం కాదు. అందుకే ఏడుపు అన్న పదానికి మీనింగ్‌ తెలియని వర్మ కూడా ఏడ్చేశాడు. ఇది వింతే కదా. కానీ ఈ విచిత్రం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో వర్మని బిగ్‌-బి పొగిడేశాడు. తాజాగా రాంగోపాల్‌ వర్మతో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ 'సర్కార్‌ 3' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ మధ్యనే వచ్చిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. అమితాబ్‌ పాత్రకి అంతా ఫిదా అయిపోయారు ఈ రెండు సినిమాల్లోనూ. ఈ సారి రాబోయే మూడో చిత్రంలో ఆయన పాత్ర అంతకు మించి ఉండబోతోందట. ఈ సినిమాతో వర్మ అంటే ఇది అనే సంగతిని మళ్లీ జనం గుర్తు తెచ్చుకోవడం పక్కా అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ అమితాబ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వర్మ గురించి సుభాష్‌ ఆడిగిన ప్రశ్నకి అమితాబ్‌ ఇచ్చిన సమాధానం అలాంటి ఇలాంటిది కాదు. వర్మని పొగడ్తలతో ముంచెత్తేశారు. కొత్తదనపు ఆలోచనలకు వర్మ పెట్టింది పేరంటూ, కొత్త కొత్త అధ్యయనాలు చేయడంలో వర్మకి వర్మే సాటి అంటూ ఆయన వర్మ గురించి చెప్పిన మాటలు ఏవో మాట వరసకి అన్నట్లుగా లేవు. గుండె లోతుల్లోంచి పుట్టికొచ్చినట్లుగా అన్పించాయి. మరి ఇంత లోతుగా పొగిడితే వర్మ లాంటి వాడు కూడా కరిగిపోక తప్పుతుందా!

ALSO READ: మార్కెట్‌ పెంచుకుంటోన్న యంగ్‌ హీరో