ENGLISH

రామ్‌తో బోయ‌పాటి?

20 March 2021-13:40 PM

ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు బోయ‌పాటి శ్రీ‌ను. వీళ్ల కాంబోలో వ‌స్తున్న 3 వ చిత్ర‌మిది. అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడ‌న్న విష‌యంలో ఇప్పుడు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. రామ్ తో బోయ‌పాటి ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికే.. రామ్ - బోయ‌పాటి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

 

`ఇస్మార్ట్ శంక‌ర్‌` త‌ర‌వాత రామ్ రూటు మార్చాడు. ప‌క్కా మాస్ యాక్ష‌న్ క‌థ‌ల్ని ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే లింగుస్వామి క‌థ‌కు ఓకే చెప్పేశాడు రామ్. మాస్ యాక్ష‌న్ సినిమాల్ని తీయ‌డంలో.. బోయ‌పాటి రూటు సెప‌రేటు. అందుకే ఇప్పుడు బోయ‌పాటితో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడ‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని టాక్‌. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

ALSO READ: 'మోసగాళ్లు' మూవీ రివ్యూ & రేటింగ్!