ENGLISH

కాశీలో 'ఇస్మార్ట్‌' యాక్షన్‌.!

30 April 2019-14:40 PM

పూరీ జగన్నాధ్‌ తాజా చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'ని ఇస్మార్ట్‌ స్టైల్‌లో తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాపై ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు పూరీ. ప్రతీ అప్‌డేట్‌నీ ఎప్పటికప్పుడే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కాశీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఇస్మార్ట్‌ యూనిట్‌ అంతా కాశీలో సందడి చేస్తున్నారు. ఇక్కడ సినిమాకి అత్యంత కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్‌ ఒకటి చిత్రీకరిస్తున్నారట. 

 

పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో ఫైట్స్‌కి ప్రత్యేక స్టైల్‌ ఉంటుంది. ఆ స్టైల్‌లోనే బీభత్సమైన ఫైట్‌ సీన్‌ని కాశీలో చిత్రీకరిస్తున్నారట. హీరో రామ్‌ ఎనర్జీకి, పూరీ స్టైల్‌ కరెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యిందనీ, అవుట్‌ పుట్‌ చాలా బాగా వస్తోందనీ అంటున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఇటు పూరీకీ, అటు రామ్‌కీ మంచి సక్సెస్‌ తెచ్చిపెట్టనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రధమార్ధం నిరాశపరిచినా, సమ్మర్‌ రిలీజ్‌ సినిమాలు రిలాక్స్‌నిచ్చాయి. 

 

ఎంతకాలంగానో హిట్‌ కోసం ఎదురు చూస్తున్న యంగ్‌ హీరోలు, చైతూ, సాయి ధరమ్‌ తేజ్‌ వంటి వారిని కూడా సమ్మర్‌ హిట్టిచ్చి ఆదుకుంది. అలాగే ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా వెలుగు వెలిగి, ఇప్పుడు స్టార్‌ హీరోలు సినిమాలు చేయడానికి సైతం భయపడుతున్న డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడేమో చూడాలిక. 

ALSO READ: బాలీవుడ్‌కి వెళుతోన్న 'కాంచన'.!