ENGLISH

త‌మిళ ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పిన రామ్‌

11 January 2021-10:15 AM

ఈ సంక్రాంతికి `రెడ్‌`తో వ‌స్తున్నాడు రామ్. `ఇస్మార్ట్ శంక‌ర్` సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఆ త‌ర‌వాత రామ్ సినిమా ఎవ‌రితో అనే విష‌యంపై నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ సందిగ్థ‌త నెల‌కొంది. ఇప్పుడు రామ్ త‌దుప‌రి సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింది. త‌మిళ ద‌ర్శ‌కుడు నేస‌న్ తో రామ్ సినిమా ఉండ‌బోతోంది. ఇప్ప‌టికే నేసన్ రామ్ కి క‌థ చెప్పేశాడు. రామ్ కూడా ఓకే అనేశాడు.

 

ఈ ఫిబ్ర‌వరి నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కబోతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకోనుంది. ఎప్ప‌టి నుంచో త‌మిళంలో ఓ సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు రామ్. ఇప్పుడు నేస‌న్ తెచ్చిన క‌థ‌లో త‌మిళ ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చే అంశాలు ఉన్నాయ‌ని టాక్‌. అందుకే.. ఈ క‌థ ఓకే చేశాడు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. వెంకీ కుడుమ‌ల తోనూ రామ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్యా క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయితే నేస‌న్ త‌ర‌వాత‌.. వెంకీ కుడుముల సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

ALSO READ: త్రివిక్ర‌మ్ తో సినిమా ఉంది.. కానీ...!