ENGLISH

భ‌ల్లాల దేవ వ‌చ్చేశాడు.. ప‌వ‌న్ రీమేక్ ఇక మొద‌లు

21 December 2020-09:38 AM

మ‌ల‌యాళం సూప‌ర్ డూప‌ర్ హిట్‌ `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడిగా ద‌గ్గుబాటి రానా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే చిత్ర‌బృందం అపీషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌లేదు. దాంతో పాటు గా గోపీచంద్, విజ‌య్ సేతుప‌తి లాంటి మ‌రికొన్ని పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రానా ఉంటాడా? మ‌రో హీరో వ‌స్తాడా? అనే అనుమ‌నాలు త‌లెత్తాయి. వాటికి చెక్ పెట్టింది చిత్ర‌బృందం.

 

ఈ రీమేక్ కి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న ఈరోజు ఉద‌యం10 గంట‌ల 17 నిమిషాల‌కు వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ముందే చెప్పింది. దాని ప్ర‌కార‌మే.. ఓ అప్ డేట్ ఇచ్చింది. ఈ రీమేక్ లో రానా ఎంట్రీ ఇచ్చాడంటూ.. అధికారికంగా ఖ‌రారు చేసింది. ఈరోజు నుంచే ఈ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్క‌బోతోంది. సాయిప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మూడు నెల‌ల్లో షూటింగ్ పూర్తి చేసి, ఈ యేడాదే విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌.

ALSO READ: ‘గతం’ మూవీకి అరుదైన అవకాశం