ENGLISH

రానా కూడా ఎంట్రీ ఇచ్చేశాడు

28 January 2021-18:30 PM

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ అయ్య‌ప్ప‌యునుమ్ కోషియ‌మ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. ఈ నెల 25 నుంచి షూటింగ్ ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ పై మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఇప్పుడు రానా కూడా సెట్లోకి వ‌చ్చేశాడు. గురువారం నుంచే రానా సెట్లోకి వ‌చ్చాడ‌ని చిత్ర‌బృందం తెలిపింది.

 

ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన 'ప్రసాద్ మూరెళ్ళ' ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా 'నవీన్ నూలి', కళా దర్శకునిగా 'ఏ.ఎస్.ప్రకాష్ లు ఇప్పటివరకు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

ALSO READ: న‌రేష్ సినిమాకి ఎన్ని కోట్ల న‌ష్టం?