ENGLISH

వెంకీ, రానా.. మ‌ల్టీస్టార‌ర్ ఖాయం!

09 November 2020-10:01 AM

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్ధ‌మైంది. వెంక‌టేష్‌, రానా ఓ సినిమా కోసం క‌ల‌సి న‌టించ‌బోతున్నారు. ఈ కాంబినేష‌న్ చూడాల‌ని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరిద్ద‌రికి స‌రి ప‌డ క‌థ కోసం సురేష్ బాబు కూడా విస్కృతంగా అన్వేషించారు. ఎట్ట‌కేల‌కు వీళ్ల‌కు త‌గిన క‌థ ఒక‌టి దొరికింది. ''వెంకీ బాబాయ్‌తో త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాను. మేం ఎదురు చూస్తున్న క‌థ కూడా దొరికింది.

 

ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి'' అని రానా ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. సో.. ఈ కాంబో ఖాయ‌మైన‌ట్టే. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. 2021లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఎఫ్ 3 త‌ర‌వాత వెంకీ చేయ‌బోయే సినిమా ఇదే కావొచ్చు. పూర్తి వివ‌రాలు తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం `నార‌ప్ప‌`తో బిజీగాఉన్నాడు వెంకీ. ఆ త‌ర‌వాత ఎఫ్ 3 ఉంటుంది. ఈలోగా రానా కూడా త‌న చేతిలోని సినిమాల్ని పూర్తి చేసుకోవాల్సివుంది.

ALSO READ: 'గ‌తం' మూవీ రివ్యూ & రేటింగ్!