ENGLISH

రంగ్ దే... మూడు రోజుల వ‌సూళ్లు ఇవీ!

29 March 2021-16:52 PM

చెక్ లాంటి డిజాస్ట‌ర్ త‌ర‌వాత‌.. నితిన్ నుంచి వ‌చ్చిన సినిమా `రంగ్ దే`. కీర్తి సురేష్‌క‌థానాయిక‌గా న‌టించింది. తొలి రోజు.. `ఓకే` సినిమాగా మౌత్ టాక్ తెచ్చుకుంది. వ‌సూళ్లూ ఫ‌ర్వాలేద‌నిపించాయి. తొలి మూడు రోజుల్లో రూ.12.20 కోట్లు సాధించింది. ఈ సినిమా 25 కోట్ల వ‌రకూ బిజినెస్ జ‌రుపుకుంది. ఇప్ప‌టికి సగం వ‌చ్చిన‌ట్టు. మ‌రో వారం రోజుల పాటు... బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌క‌డైన వ‌సూళ్లు తెచ్చుకుంటే.. బ్రేక్ ఈవెన్‌కి ద‌గ్గ‌ర ప‌డుతుంది. లేదంటే.. వ‌రుస‌గా రెండో సినిమా కూడా న‌ష్టాల పాల‌వ్వాల్సిందే. ప‌రిస్థితి చూస్తుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌డం క‌ష్టంగా అనిపిస్తోంది.

 

తొలి మూడు రోజుల వ‌సూళ్లు

 

నైజాం : Rs 3.80 కోట్లు

 

సీడెడ్ : Rs 1.50 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌ : Rs 1.30 కోట్లు

ఈస్ట్‌ : Rs 85 ల‌క్ష‌లు

వెస్ట్ : Rs 58 ల‌క్ష‌లు

గుంటూరు : Rs 1.09 కోట్లు

కృష్ణ‌ : Rs 53 ల‌క్ష‌లు

నెల్లూరు : Rs 45 ల‌క్ష‌లు

ఏపీ, తెలంగాణ‌ : Rs 10.10 కోట్లు

క‌ర్నాట‌క‌ : Rs 50 ల‌క్ష‌లు

ఓవ‌ర్సీస్‌: Rs 1.10 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: Rs 50 ల‌క్ష‌లు

 

3 రోజుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా : Rs 12.20 కోట్లు (షేర్‌)

ALSO READ: హెబ్బా... ఇలా అయ్యిందేంట‌బ్బా..?