ENGLISH

రంగ్ దే.. తొలి రోజు వ‌సూళ్లు

27 March 2021-11:10 AM

నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. ప్ర‌మోష‌న్లు భారీగా చేయ‌డం, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై ఫోక‌స్ ప‌డింది. మంచి పాజిటీవ్ బ‌జ్ తో.. శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ శుక్ర‌వారం `అర‌ణ్య‌` కూడా విడుద‌లైన‌ప్ప‌టికీ.. ఓపెనింగ్స్ `రంగ్ దే`కే బాగున్నాయి. యావ‌రేజ్ టాకే వ‌చ్చినా... తొలి రోజు 4.65 కోట్లు తెచ్చుకోగ‌లిగింది.

 

నైజం: రూ.1.54 కోట్లు

ఈస్ట్‌: 52 ల‌క్ష‌లు

వెస్ట్ 31 ల‌క్ష‌లు

కృష్ణా 21 ల‌క్ష‌లు

నెల్లూరు 24 ల‌క్ష‌లు

వైజాగ్ 56 ల‌క్ష‌లు

గుంటూరు 67 ల‌క్ష‌లు

సీడెడ్ 60 ల‌క్ష‌లు

 

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల‌లో కలిపి 4.65 కోట్లు వ‌చ్చాయి. ఈ సినిమా దాదాపుగా 25 కోట్ల బిజినెస్ చేసుకుంది. శ‌ని, ఆదివారాల వ‌సూళ్ల‌ని బ‌ట్టి, రంగ్ దే జాత‌కం ఆధార‌ప‌డి ఉంటుంది.

ALSO READ: `రంగ్ దే` మూవీ రివ్యూ & రేటింగ్!