ENGLISH

'రంగ్ దే'.... ప్రీ రిలీజ్ అదిరింది!

25 March 2021-11:34 AM

గ‌త నెల‌లో చెక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు నితిన్‌. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయినా స‌రే... ఆ భారం రంగ్ దే పై ప‌డ‌లేదు. శుక్ర‌వారం విడుద‌ల అవుతున్న రంగ్ దే బిజినెస్‌... సూప‌ర్బ్ గా జ‌రిగింది. నితిన్ గ‌త చిత్రాల‌కంటే.. మంచి రేట్ల‌కే అమ్ముడుపోయింది. థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలోనే దాదాపుగా పాతిక కోట్లు వ‌చ్చాయి. రొమాంటిక్ కామెడీ జోన‌ర్ కావ‌డం, పాట‌లు, ప్రచార చిత్రాలు బాగుండ‌డం. కీర్తి సురేష్ లాంటి క్రౌడ్ పుల్ల‌ర్ హీరోయిన్ కావ‌డం వ‌ల్ల‌... `రంగ్ దే`కి ఈ రేంజు బిజినెస్ జ‌రిగింది.

 

నైజాం లో 7.2 కోట్ల‌కు అమ్ముడైంది. సీడెడ్ లో 3.6 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్రా నుంచి ఏకంగా 10 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్ నుంచి 2 కోట్లు, మిగిలిన ఏరియాల నుంచి మ‌రో 2 కోట్లు వ‌చ్చాయి. మొత్తానికి 24.8 కోట్ల బిజినెస్ చేయ‌గ‌లిగింది. ఈ వారం `అర‌ణ్య‌` అనే మ‌రో సినిమా వ‌స్తోంది. దాంతో పోలిస్తే `రంగ్ దే`కి ఎక్కువ థియేట‌ర్లు దొరికాయి. దాంతో పాటుగా క్రేజ్ కూడా ఈ సినిమాకే ఎక్కువ ఉంది.

ALSO READ: Keerthi Suresh Latest Photoshoot