ENGLISH

వీకెండ్‌ పార్టీలో రష్మికా.!

01 May 2019-11:49 AM

టాలీవుడ్‌లో మోస్ట్‌ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా. డేట్స్‌ అడ్జస్ట్‌ కావడం లేదు కానీ, టాలీవుడ్‌ దర్శక నిర్మాతలంతా తమ తమ సినిమాల్లో రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. రష్మిక నటించిన 'డియర్‌ కామ్రేడ్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది.

 

ఇదిలా ఉంటే, తాజాగా రష్మిక నటించిన అనువాద చిత్రమొకటి అనూహ్యంగా విడుదలకు సిద్ధమైంది. 'అవెంజర్స్‌' హాలీవుడ్‌ మూవీ దెబ్బకి 'అర్జున్‌ సురవరం' వంటి అంచనాలున్న మూవీనే రిలీజ్‌ డేట్‌ వాయిదా వేసుకున్న ఈ తరుణంలో రష్మిక నటించిన అనువాద చిత్రాన్ని ధైర్యంగా ప్రేక్షుల ముందుకు తీసుకొస్తున్నారు. 'ఛలో గీతా - వీకెండ్‌ పార్టీ' అనే టైటిల్‌తో ఈ సినిమాని దివాకర్‌ సమర్పణలో మామిడాల శ్రీనివాస్‌, దుగ్గివలస శ్రీనివాస్‌ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యంగా యూత్‌కి ఆరాధ్య దేవతగా మారిపోయిన రష్మిక సినిమా అంటే మళ్లీ యూత్‌ క్యూ కట్టడం మామూలే. అసలే సమ్మర్‌ సీజన్‌. అందులోనూ యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కంటెన్ట్‌.

 

ఈ వీకెండ్‌లో మరో తెలుగు సినిమా లేనే లేదు. ఇన్ని కలిసొచ్చే అంశాలున్నాయి. సోషల్‌ మీడియాలో రష్మిక ఓ పిక్‌ పెడితేనే ఆ పిక్‌కి బోలెడన్ని లైకులూ, షేర్లూ వచ్చేస్తుంటాయి. గ్లామరా అంటే, అదీ లేదు. కానీ ఏంటో తెలీదు ఈ అమ్మడి మ్యాజిక్‌. కేవలం ఈ మ్యాజిక్‌నే పెట్టుబడిగా పెట్టి, దివాకర్‌ ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. కన్నడలో మంచి విజయం సాధించిన 'ఛలో గీతా' తెలుగులో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలిక.

ALSO READ: ఆ హీరోయిన్‌ అంత పెద్ద త్యాగం చేసిందా.?