ENGLISH

పుకార్ల‌పై ర‌ష్మిక సీరియ‌స్‌

10 September 2020-15:00 PM

టాలీవుడ్ లో పుకార్లు స‌ర్వ‌సాధార‌ణం. సినిమా ప‌రిశ్ర‌మ లో గాసిప్పులు మామూలే. టాప్ రేంజులో ఉన్న క‌థానాయిక‌ల‌పై బోల్డ‌న్ని రూమ‌ర్లు. ర‌ష్మిక‌పై అలాంటి రూమ‌రే ఒక‌టి తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ యువ క‌థానాయ‌కుడితో ర‌ష్మిక చాలా క్లోజ్ గా ఉంటోంద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌న్న‌ది ఆ గాసిప్ సారాంశం. దీనిపై ర‌ష్మిక చాలా సీరియ‌స్ గా స్పందించింది.

 

త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి మ‌గాడితోనూ లింకులు పెట్టి మాట్లాడ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. తాను ప్ర‌స్తుతం సింగిల్ గానే ఉన్నాన‌ని, అందులోనే ఆనందం ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఒంట‌రిగా ఉండ‌డంలో ఉన్న ఆనందాన్ని అనుభ‌విస్తేనే, కాబోయే జీవిత భాగ‌స్వామిపై ఓ అంచనా వ‌స్తుంద‌ని, వాళ్ల‌పై గౌర‌వం పెరుగుతుంద‌ని సూచించింది. ఇక‌పైనైనా త‌న రిలేష‌న్ షిప్ గురించి మాట్లాడ‌డం మానుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక `పుష్ష‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ప్ర‌త్యేకంగా చిత్తూరు యాస నేర్చుకొంటోంది.

ALSO READ: Rashmika Latest Photoshoot