ENGLISH

శ్రీ‌దేవి బయోపిక్ అయితే ప‌క్కా..!

04 September 2020-11:04 AM

బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోందిప్పుడు. సినీ తార‌ల బ‌యోపిక్‌ల‌కైతే మ‌రింత గిరాకీ ఏర్ప‌డింది. అందులో భాగంగానే శ్రీ‌దేవి బ‌యోపిక్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. బోనీ క‌పూర్ ఈ బ‌యోపిక్ ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాక‌పోతే.. శ్రీ‌దేవి పాత్ర‌ధారి ఎవ‌రన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. అందుకోసం చాలామంది పేర్లు ప‌రిశీలిస్తున్నారు. అయితే.. పోటీలో నేను కూడా ఉన్నానంటూ ర‌ష్మిక ప‌రోక్షంగా - ప్ర‌క‌టించేసింది.

 

ఈమ‌ధ్య సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో కాసేపు స‌ర‌దాగా చిట్ చాట్ చేసింది ర‌ష్మిక‌. అందులో భాగంగా `సౌంద‌ర్య బ‌యోపిక్‌, శ్రీ‌దేవి బ‌యోపిక్.. రెండింటిలో ఏది చేస్తే బాగుంటుందో స‌ల‌హా ఇవ్వండి..` అంటూ అభిమానుల్ని అడిగింది. వాళ్లంతా ముక్త కంఠంతో శ్రీ‌దేవి బ‌యోపిక్ అనేశారు. `నేనూ అదే అనుకుంటున్నా` అని స‌మాధానం ఇచ్చింది ర‌ష్మిక‌. అంటే.. ర‌ష్మిక‌కు మ‌న‌సులో శ్రీ‌దేవి బ‌యోపిక్ చేయాల‌ని వుంద‌న్న‌మాట‌. ఈ ఆఫ‌ర్ తో ఎవ‌రైనా ర‌ష్మిక‌ని సంప్ర‌దించారా? లేదంటే ర‌ష్మిక‌నే అలాంటి ఆఫ‌ర్ కోసం ఎదురు చూస్తోందా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొత్తానికి శ్రీ‌దేవి బ‌యోపిక్ చేయ‌డానికి ర‌ష్మిక సైడు నుంచి అంతా ఓకే. మ‌రి.. బోనీ క‌పూర్ ఏమంటాడో?

ALSO READ: ఎంత ఓపిక‌.. ఎంత స‌హ‌నం... ఎంత సంస్కారం?