ENGLISH

వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చిన ర‌వితేజ‌

11 January 2022-17:09 PM

ర‌వితేజ ఈమ‌ధ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌చ్చిన క‌థ‌ని, వ‌చ్చిన‌ట్టు ఓకే చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న క‌థానాయ‌కులలో త‌న‌దే అగ్ర‌స్థానం. రామారావు ఆన్ డ్యూటీ, థ‌మాకా, ఖిలాడీ, న‌ర‌కాసుర ఇవ‌న్నీ ర‌వితేజ చేతిలో ఉన్న సినిమాలు. మారుతి క‌థ‌కు కూడా ఓకే అనేశాడ‌ని ఓ టాక్‌. చిరంజీవి సినిమాలో ర‌వితేజ ఓ క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. వీట‌న్నింటి మ‌ధ్య ఓ వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడికి అక‌వాశం ఇచ్చాడ‌ట‌. అత‌నెవ‌రో కాదు.. భీమనేని శ్రీ‌నివాస‌రావు.


ఒక‌ప్పుడు రీమేక్ రాజాగా పేరు తెచ్చుకున్నారు భీమ‌నేని. ఆయ‌న తీసిన ప్ర‌తీ సినిమా హిట్టే. పైగా క్లాస్ సినిమాల‌కు ఆయ‌న పెట్టింది పేరు. ర‌వితేజ‌తో దొంగోడు తెర‌కెక్కించారు. అదీ బాగానే ఆడింది. ఇప్పుడు ఆ భీమ‌నేనికే ర‌వితేజ మ‌రో ఛాన్స్ ఇచ్చార్ట‌. క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈసారి కూడా భీమ‌నేని రీమేక్ క‌థ‌నే ఎంచుకున్నార‌ట‌. మ‌రి ఆ క‌థ ఏ భాష‌లోనిది?  ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంది?  అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

ALSO READ: ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడు సైలెంట్ అయిపోడేంటి?