ENGLISH

'ఎం.ఆర్‌.ఓ' గా ర‌వితేజ‌?

01 July 2021-12:11 PM

తెలుగు సినిమాల్లో హీరోలు టీచ‌ర్లు, లెక్చ‌ల‌ర్లు, పోలీసులు, క‌లెక్ట‌ర్లు, ముఖ్య‌మంత్రులుగా కూడా ప‌నిచేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎం.ఆర్‌.ఓగా ఒక్క‌రూక‌నిపించ‌లేదు. ఇప్పుడు ర‌వితేజ ఆ లోటు తీరుస్తున్న‌ట్టు టాక్‌. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ మాండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈరోజే లాంఛ‌నంగా ప్రారంభించారు. కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ కార్యాల‌యం ముందు ర‌వితేజ టైప్ మిష‌న్ ముందు కూర్చుని అర్జీలు పెట్టుకుంటున్న‌ట్టు ఉన్న పోస్ట‌ర్ అది.

 

ఇందులో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓగా క‌నిపించ‌నున్నాడ‌ని, ఈ సినిమాకి `ఎం.ఆర్‌.ఓ` అనే టైటిల్ ఫిక్స‌ఖ్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. మ‌రి ర‌వితేజ పాత్ర తీరు ఎలా ఉంటుందో, తెలియాలంటే..ఇంకొన్ని రోజులు ఆగాలి. ర‌వితేజ `ఖిలాడీ` షూటింగ్ పూర్త‌యింది. తొలి కాపీ కూడా సిద్దమైంది. ఆగ‌స్టులో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ALSO READ: విజ‌య్ పెద్ద ప్లానే వేశాడే..?!