ENGLISH

ఈగల్ మూడు రోజుల వ‌సూళ్లు

12 February 2024-10:25 AM

ధ‌మాకా త‌ర‌వాత ర‌వితేజ ఖాతాలో స‌రైన హిట్ ప‌డ‌లేదు. వచ్చిన సినిమా వ‌చ్చిన‌ట్టే వెన‌క్కి వెళ్తోంది. ఆ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు ఈగల్ కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టైంది. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా పీపుల్ మీడియా ఫ్యార్ట‌రీ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'ఈగిల్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈనెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి యావ‌రేజ్ రివ్యూలు వ‌చ్చాయి. అయితే బాక్సాఫీసు మాత్రం కాస్త నిల‌బ‌డ‌గ‌లిగింది.


తొలి రోజు రూ. 6.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రెండోరోజు మ‌రో రూ.5 కోట్లు త‌న ఖాతాలో వేసుకొంది. ఆదివారం మాత్రం వ‌సూళ్లు కాస్త త‌గ్గాయి. మూడో రోజు కేవ‌లం రూ.3 కోట్ల షేర్‌తో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. మూడో రోజు కలెక్షన్స్ మాత్రం కాస్త తగ్గాయి. మూడోరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘ఈగల్’.. రూ. 3 కోట్ల షేర్ సాధించింది. అలా తొలి మూడు రోజుల్లో ‘ఈగల్’.. రూ.11.50 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.


ఓవ‌ర్సీస్‌లో మ‌రో రూ.2 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో ఇంకో రూ.2 కోట్లు వేసుకొంటే దాదాపుగా 15 కోట్లు సాధించిన‌ట్టైంది. ఈవారం విడుద‌లైన సినిమాల్లో `ఈగిల్‌`కే కాస్త క్రేజ్ ఉంది. సో.. థియేట‌ర్లో మ‌రో కొత్త సినిమా వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ వ‌సూళ్లు నిల‌క‌డ‌గా కొన‌సాగే అవ‌కాశం ఉంది.