ENGLISH

ర‌వితేజ‌కు భ‌లే ఛాన్సులే!

15 December 2020-12:00 PM

హిందీ డ‌బ్బింగ్ రూపంలో తెలుగు సినిమాల‌కు మంచి గిరాకీ వ‌స్తోంది. మాస్ సినిమా, అందులోనూ అగ్ర హీరో సినిమా అంటే హిందీ డ‌బ్బింగుల ద్వారా క‌నీసం 10 కోట్ల‌యినా వ‌స్తోంది. హిందీ డ‌బ్బింగుల వ‌ల్ల‌... మ‌న హీరోలూ నార్త్ కీ ప‌రిచ‌య‌మైపోయారు. ఇప్పుడు ఏకంగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ హిందీలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే దానికి కార‌ణం.. ఆ డ‌బ్బింగు సినిమాలే.

 

ఇప్పుడు ర‌వితేజ కూడా ఓ అడుగు ముందుకేశాడు. తన లేటెస్ట్ సినిమా `క్రాక్‌`ని నేరుగా హిందీలో విడుద‌ల చేయ‌బోతున్నారు. నిజానికి ఈ సినిమాని డిజిట‌ల్ రూపంలో హిందీలోనూ తీసుకెళ్లాల‌నుకున్నారు. కానీ.. నార్త్ లో థియేట‌ర్లు ఓపెన్ అయినా, అక్కడ స‌రైన కంటెంట్ లేదు. కొత్త సినిమాల విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతోంది. అందుకే `క్రాక్‌` హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ అక్క‌డ నేరుగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యార్ట‌. దీని వ‌ల్ల నిర్మాత‌ల‌కు అద‌న‌పు ఆదాయం రావొచ్చ‌ని భావిస్తున్నారు. తెలుగులో రూపుదిద్దుకుంటున్న మ‌రిన్ని సినిమాలు ఇప్పుడ నార్త్ లో.. నేరుగా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వాటికి ఎలాంటి గిరాకీ ల‌భిస్తుందో చూడాలి.

ALSO READ: 70 అనుకుంటే 100 అవుతోంది!