ENGLISH

మెగా సినిమా నుంచి రవితేజ అవుట్ ?

03 May 2022-10:08 AM

ఆచార్య ఫ్లాఫ్ మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలని ఆలోచనలో పడేసింది. చిరు, బాబీతో కలిసి మాస్ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి వాల్తేర్ వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సోదరుడిగా నటించేందుకు రవితేజను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రవితేజ 16 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేయడం, మేకర్స్ కోట్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించడం జరిగింది.

 

ఐతే కొత్త అప్‌డేట్‌ ఏమిటంటే.. నిర్మాతలు ప్లాన్ మార్చుకున్నారు. రవితేజని సినిమా నుండి తప్పించాలని నిర్ణయించుకున్నారు. రవితేజ స్థానంలో మరొక నటుడిని తీసుకోవాలని దర్శకుడికి సుచించారు. సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ఇంకా సెట్స్‌లోకి జాయిన్ కాలేదు. ఇంతలోనే మేకర్స్ తమ ప్లాన్‌లను మార్చుకున్నారు. చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం బాబీ, రవితేజ స్థానంలో మరో నటుడిని వెతికే పనిలో వున్నారు. మొత్తానికి ఆచార్య ఫ్లాఫ్ తో నిర్మాతలు వెంటనే బడ్జెట్ పాఠం మీద ద్రుష్టి పెట్టారని అనుకోవాలి.

ALSO READ: టీవీ 9 ఓవర్ యాక్షన్