ENGLISH

ర‌వితేజ‌కు అంత డిమాండ్ ఏమిట‌బ్బా?

03 November 2021-10:01 AM

ఈమ‌ధ్య కాలంలో ర‌వితేజ కు క్రాక్ అనే హిట్ ప‌డింది. అంత‌కు ముందు అన్నీ ఫ్లాపులే. దాదాపుగా ర‌వితేజ ఖేల్ ఖ‌తం అనుకున్నారంతా. కానీ... క్రాక్ తో పుంజుకున్నాడు. అలా ఇలా కాదు. ఇప్పుడు త‌న చేతిలో ఏకంగా 4 సినిమాలున్నాయి. ఇప్పుడు అభిషేక్ పిక్చ‌ర్స్‌లో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. వంశీ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. గ‌జ దొంగ `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` జీవిత క‌థ‌ని ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఇది.

 

ఈ సినిమా కోసం ర‌వితేజ ఏకంగా 18 కోట్ల పారితోషికం తీసుకున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ ర‌వితేజ పారితోషికం 10 కోట్లే. ఆ త‌ర‌వాత 12 అయ్యింది. క్రాక్ హిట్ త‌ర‌వాత 15 చేశాడు. ఇప్పుడేమో 18 అంటున్నారు. ఒకే ఒక్క హిట్ తో ర‌వితేజ ఇంత పారితోషికం ఎలా పెంచేశాడో? ర‌వితేజ అడిగినంత ఎలా ఇస్తున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అయితే ఈమ‌ధ్య హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో మంచి డ‌బ్బులు వ‌స్తున్నాయి. ర‌వితేజ సినిమా అంటే హిందీ నుంచి క‌నీసం 12 కోట్ల వ‌ర‌కూ వ‌స్తోంది. దానికి తోడు ఓటీటీ ఎలాగూ ఉంది. అందుకే ఇప్పుడు ర‌వితేజ త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేశాడ‌ని టాక్‌. మ‌రో హిట్ పడితే.. ర‌వితేజ పాతి కోట్లు ప‌లికేయ‌డం ఖాయం.

ALSO READ: బాల‌కృష్ణ‌కు ఆప‌రేష‌న్‌... ఇంత‌కీ ఏం జ‌రిగింది?