ENGLISH

చెర్రీతో కలిసి నటించాలని ఉందా?

03 February 2024-20:49 PM

RRR  సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ఈ మూవీ తరవాత  నెక్స్ట్  చెర్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో  నటిస్తున్న చరణ్‌ సరసన కియారా అద్వాణీ, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్  ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరక్షన్లో ఇంకో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు చెర్రీ. ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో అనగానే మంచి బజ్ ఏర్పడింది. రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు సమాచారం.


ఈ మూవీకి సంబంధించి, లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. RC16 మూవీకోసం నటీనటుల గూర్చి బుచ్చిబాబు వెతుకున్నారని, దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో   పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.  ఉత్తరాంధ్ర నుంచే ఏకంగా 400 మందిని ఎంపిక చేసుకోనున్నట్లు లేటెస్ట్ పోస్ట్ ద్వారా చెప్పారు. విభిన్న క్రాఫ్ట్స్ చూసుకునే సాంకేతిక నిపుణులు, ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా డైలాగ్స్ చెప్పే ప్రతిభ ఉన్న నటీనటులు కావాలని మేకర్స్ ప్రకటించారు.


ఔత్సాహిక నటీనటులందరిని ఆడిషన్ చేసేందుకు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా రివీల్ చేశారు మేకర్స్. RC16 సినిమా కోసం చేసే ఆడిషన్‌ను ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించనున్నారు. విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇందుకు వేదిక కానున్నాయి.